
హైదరాబాద్, 09 జనవరి (హి.స.)
డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ
ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అడ్వొకేట్ వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. గుడిమల్కాపూర్ లో నమోదైన డ్రగ్స్ కేసులో.. FIRలో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వొకేట్ కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్ లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.కాగా 2023 సెప్టెంబరులో నవదీప్ పై మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసు నమోదయింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు