శంషాబాద్ ఎయిర్పోర్టులో 14 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 14 కిలోల హైడ్రోఫోనిక్ ( మట్టి లేకుండా సాగు చేసే ) గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల
గంజాయి


హైదరాబాద్, 09 జనవరి (హి.స.) హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 14 కిలోల హైడ్రోఫోనిక్ ( మట్టి లేకుండా సాగు చేసే ) గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శుక్రవారం ఉదయం ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. వారి వద్ద హైడ్రోఫోనిక్ గంజాయి దొరికింది. దీని విలువ రూ.14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయితో పట్టుబడిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande