మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బూట్లు, బెల్టులు..
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్టు సీఎం రేవంత
విద్యార్థులకు బూట్లు


హైదరాబాద్, 09 జనవరి (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ

పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా ఇప్పటికే విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఉచితంగా ఇస్తుండగా.. బూట్లు, బెల్టులు కూడా ఇస్తే బాగుంటుందని విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం రేవంత్ అంగీకరించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande