హిమాచల్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన ప్రైవేట్ బస్సు.. 8 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్, 09 జనవరి (హి.స.) హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగ
బస్సు ప్రమాదం


హిమాచల్ ప్రదేశ్, 09 జనవరి (హి.స.) హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కుప్వీ నుంచి సిమ్లాకు ప్రయాణిస్తున్న ఈ బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సిర్మూర్ జిల్లా హరిఫురధర్ ప్రాంతంలోని మారుమూల కొండదారిలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande