
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}చెన్నై, 09, జనవరి (హి.స.)న్యూస్‌టుడే: ఐఐటీ మద్రాస్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. సీ-డాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుందని ఐఐటీ మద్రాస్ గురువారం ప్రకటనలో పేర్కొంది. ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు కూడా వీలుగా ఉండనుందని పేర్కొంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఇటీవల ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘పరమ్ శక్తి’ పేరిట ప్రారంభమైన అధునాతన వ్యవస్థను పరిశోధకులు ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రారంభోత్సవంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ఆచార్యులు వి.కామకోటి, సీ-డాక్ డైరెక్టర్ ఇ.మగేష్, ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సెంటర్ ఛైర్మన్, ఆచార్యులు జి.ఫణికుమార్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ