కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం.. కేటీఆర్
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత పురోగతి కేసీఆర్ దూరదృష్టి, నాయకత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014-15 నుంచి 2024-15 పదేళ్ల కాలంలో వరి సాగులో తెలంగాణ 240 శాతం వృద్ధి సాధించడంపై
కేటీఆర్


హైదరాబాద్, 09 జనవరి (హి.స.)

వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత పురోగతి కేసీఆర్ దూరదృష్టి, నాయకత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014-15 నుంచి 2024-15 పదేళ్ల కాలంలో వరి సాగులో తెలంగాణ 240 శాతం వృద్ధి సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ మార్క్ అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుక్రవారం కేటీఆర్ స్పందించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలే ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande