
హైదరాబాద్, 09 జనవరి (హి.స.)యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని మౌలానా అబ్దుల్ నేషనల్ యూనివర్సిటీ (MANU) విద్యార్థులు ఆరోపించారు. భూముల అమ్మకాలపై పోరాటం చేస్తుంటే వేధిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూనివర్సిటీల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తే సహించమని వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగేవాళ్లు విద్యార్థులకు అన్యాయంపై స్పందించరా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో కేటీఆర్తో సమావేశం అనంతరం మనూ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ కుట్రలపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఎంపీలందరూ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు