గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, 09 జనవరి (హి.స.) గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచే అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యానంద్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి కప్ (సీఎం కప్) టార్చ్
కలెక్టర్ రాహుల్ రాజ్


మెదక్, 09 జనవరి (హి.స.) గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచే అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యానంద్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి కప్ (సీఎం కప్) టార్చ్ ర్యాలీని అధికారులతో కలిసి టార్ను వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనని తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీఎం కప్ క్రీడా కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande