
నారాయణపేట, 09 జనవరి (హి.స.)
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ
ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం ఉదయం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉదయాన్నే మక్తల్ పట్టణంలోని పలుకాలనీల్లో సుడిగాలి పర్యటన చేసి అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మక్తల్ పట్టణంలో నూతనంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన ట్యాంక్బండ్ సుందరీకరణ పనులపై సమీక్ష నిర్వహించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు