
భద్రాద్రి కొత్తగూడెం, 09 జనవరి (హి.స.)
ఇల్లందు మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్
ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లందు మున్సిపల్ పరిధిలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు గా ముందుకు పోతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు