మెగా హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి పొన్నం
సిద్దిపేట, 09 జనవరి (హి.స.) మెగా హెల్త్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలత
మంత్రి పొన్నం


సిద్దిపేట, 09 జనవరి (హి.స.)

మెగా హెల్త్ క్యాంపును ప్రజలందరూ

సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్వీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్త్ చెకప్ కోసం వచ్చిన వారితో మంత్రి మాట్లాడి, అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తామని, అవసరమైతే హైదరాబాద్లో చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ మండలంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏడు మండలాలకు ఏడు మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలో దత్తత తీసుకొని, ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande