
నాగర్ కర్నూల్, 09 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ పట్టణంలోని, జిల్లా
పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి సీఎం కప్ టార్చ్ ర్యాలీ ని కలెక్టర్ సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే 'సీఎం కప్' ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
గ్రామీణ యువత క్రీడల వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా మార్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు