'రాజాసాబ్' టికెట్ల రేటు పెంపుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ది రాజాసాబ్'' టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అ
రాజా సాబ్


హైదరాబాద్, 09 జనవరి (హి.స.)

ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజాసాబ్' టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాతలు ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి నుంచే ప్రీమియర్స్ షోలు నిర్వహించేందుకు అనుమతి కోరగా, ఆ అంశానికి మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ప్రీమియర్స్కు అనుమతి నిరాకరించినప్పటికీ, టికెట్ ధరల పెంపునకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదలైన ఈ జీవో ప్రకారం, జనవరి 9 నుంచి జనవరి 11 వరకు మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105, మల్టీప్లెక్స్లలో రూ.132 మేర టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్లలో రూ.89 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande