
వనపర్తి, 09 జనవరి (హి.స.)
వనపర్తి జిల్లా సమీకృత అధికారుల
కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్, పౌర సరఫరా శాఖ జిల్లా అధికారి కాశీ విశ్వనాధను శుక్రవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ సీ.హెచ్. బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్ డీఎస్పీ సీహెచ్. బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి ఒక రైస్మిల్ యజమానిని సీఎం.ఆర్ కోట బియ్యం కేటాయింపు కోసం లంచం డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డ డీఎం జగన్మోహన్, అతని డ్రైవర్ లక్ష్మణ్ నాయక్ల విచారణ కొనసాగింపులో భాగంగా శుక్రవారం ఉదయం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్, పౌర సరఫరా శాఖ జిల్లా అధికారి కాశీ విశ్వనాధపై ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వారిని విచారించినట్లు తెలిపారు. అనంతరం డీఎం జగన్మోహన్తో పాటు కారు డ్రైవర్ లక్ష్మణ్ నాయకు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు హైదరాబాద్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు