మిర్యాలగూడలో సిమెంట్ ట్యాంకర్ను ఢీకొన్న డీసీఎం.. ముగ్గురు దుర్మరణం
నల్గొండ, 09 జనవరి (హి.స.) నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మిర్యాలగూడ టౌన్ లోని ఈదులగూడెం చౌరస్తా వద్ద సిమెంట్ మిక్సింగ్ ట్యాంకరు ఇటాలియన్ మార్బుల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమా
రోడ్డు ప్రమాదం


నల్గొండ, 09 జనవరి (హి.స.)

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మిర్యాలగూడ టౌన్ లోని ఈదులగూడెం చౌరస్తా వద్ద సిమెంట్ మిక్సింగ్ ట్యాంకరు ఇటాలియన్ మార్బుల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్బుల్స్ మీద పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులను బీరుబాయ్, సంతోశ్, సూరత్గా గుర్తించారు. సిమెంట్ ట్యాంకర్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తుండగా.. డీసీఎం శంషాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande