
సిద్దిపేట, 09 జనవరి (హి.స.)
విద్యార్థులకు నాణ్యమైన వంటలు
ఏర్పాటుచేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వంటలు వండాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని అనంత సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పాఠశాలలో వండిన అన్నం, చిక్కుడుకాయ, సాంబార్, గుడ్డు వంటలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం రుచికరంగా విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. పాఠశాల సమయ వేళల్లో విద్యార్థుల ను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఉపాధ్యాయులు చూసుకోవాలి హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు