
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
చెన్నై,09,జనవరి (హి.స.)మద్రాస్ హైకోర్టు తీర్పుతో జన నాయగన్ విడుదలకు మార్గం సుగమమైంది. సంక్రాంతి రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతేడాది డిసెంబర్‌లో జన నాయగన్ నిర్మాతలు సినిమా విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డును ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేసింది. ఈ ఆలస్యంపై జననాయగన్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే అంశంపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తాజా విచారణలో సింగిల్ బెంచ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఫిర్యాదు దారుడి గోడు విన్న తర్వాత కూడా సెన్సార్ ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా ఉంది.
అంటే, సీబీఎస్‌ఈ మొదట్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దరఖాస్తును స్వీకరించింది. కానీ తరువాత, విడుదలకు దగ్గరగా వచ్చేసరికి కొత్తగా అభ్యంతరాలు పెట్టింది. ఇది ముందే ఉన్న అసలు సమస్య కాకుండా, తరువాత కల్పించిన సమస్యలా ఉందని కోర్టు భావించింది. అంతేకాదు, సర్టిఫికేషన్ ప్రక్రియలో అనవసరమైన ఆటంకాలు సృష్టించడం తగదని కోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. అనంతరం, సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎస్ బోర్డుకు సూచించింది. దీంతో జన నాయగన్ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ