యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో రికార్డు.. 72 గంటల్లో 816 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన స్టేజ్-2లోని నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) గురువారం వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)ని విజయవంతంగా పూర్తి చే
యాదాద్రి థర్మల్ పవర్


హైదరాబాద్, 09 జనవరి (హి.స.) ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన స్టేజ్-2లోని నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) గురువారం వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 72 గంటల నిరంతర పరీక్షా కాలంలో యూనిట్ సగటున 816 మెగావాట్లకు పైగా ఉత్పత్తి చేస్తూ గరిష్ఠంగా 825 మెగావాట్ల లోడ్ను మోసింది. ఈ నాలుగో యూనిట్ వాణిజ్య ఉత్పత్తిలోకి రావడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి 3,200 మెగావాట్లకు చేరింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande