
పిఠాపురం, 09 జనవరి (హి.స.)
కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబురాల ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు హైపర్ ఆది(Hyper Adi), సాగర్(Sagar) అలియాస్ ఆర్కే నాయుడుపై పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. హైపర్ ఆది మాట బాగుంటుందని, అందరూ కామెడీ హ్యూమర్ అని అనుకుంటారని, కానీ ఆయన మాటల్లో చాలా విక్ట్ ఉంటుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలకు వచ్చినందుకు హైపర్ ఆదికి తాను హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
అలాగే మరో సినీ నటుడు సాగర్ (ఆర్కే నాయుడు ) కరీంనగర్ నుంచి వచ్చారని, ఆయనకు ఆంధ్ర ప్రేమను పంచండని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని స్వీకరించమని తెలంగాణ సోదరులు, సోదరీమణులను ఆహ్వానించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండగను చూస్తుంటే పిడికెడు గింజలు పండించడం చాలా కష్టమని తెలుస్తుందన్నారు. చేతికొచ్చిన పంటను నెలపాలు చేయడం చాలా ఈజీ అని తెలిపారు. కూటమిని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డామని, కానీ దాన్ని చెడగొట్టడం చాలా తేలిక అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చినప్పుడు వచ్చే సంతోషమే సంక్రాంతి పండగ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV