ఇరుసుమండలో ఏరియల్ సర్వే.. బ్లోఅవుట్‌ను పరిశీలించిన సీఎం
ఇరుసుమండ, 09 జనవరి (హి.స.) అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో మూడు రోజుల క్రితం ఓఎన్జీసీ గ్యాస్ లీకై.. భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా
చంద్రబాబు


ఇరుసుమండ, 09 జనవరి (హి.స.)

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో మూడు రోజుల క్రితం ఓఎన్జీసీ గ్యాస్ లీకై.. భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఇరుసుమండలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

హెలికాప్టర్ నుంచి బ్లోఅవుట్ స్పాట్ ను పరిశీలించారు.

ప్రమాద ఘటనపై ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వివరాలు అందించారు.

ప్రమాద తీవ్రత, ఆ చుట్టుపక్కల ఉన్న కొబ్బరితోటలు, పంటలకు కలిగిన నష్టం, గ్రామస్తుల పునరావాసంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంటలు ఎప్పటి అదుపులోకి వస్తాయో అడిగి తెలుసుకున్నారు.

మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande