
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
జమ్మూ,09,జనవరి (హి.స.) కశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు, వారి ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆపరేషన్లపై షా ఆరా తీశారు. ఎలాంటి సడలింపులు లేకుండా మిషన్ మోడ్‌లో కొనసాగాలని ఆదేశించారు. ఈ లక్ష్యం కోసం అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గురువారం నిర్వహించిన జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు కేంద్ర సాయుధ బలగాల అధిపతులు పాల్గొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత సాధించిన భద్రతా పురోగతిని కాపాడుకోవాలని, అన్ని భద్రతా సంస్థలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ