
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.cf5{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
న్యూఢిల్లీ,,09,జనవరి (హి.స.)
గత ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో ఘోర బస్సు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్ స్లీపర్ బస్సు బాడీ బిల్డర్లకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు, తయారీ సంస్థలకే బస్సుల తయారీకి అనుమతి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటన జారీ చేసింది.
7
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ