వృద్ధులకు అండగా ప్రభుత్వం.. భూపాలపల్లి ఎమ్మెల్యే
వయోవృద్ధుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కల్పించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు.
Mla


భూపాలపల్లి, 01 అక్టోబర్ (హి.స.)

వయోవృద్ధుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కల్పించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు.

తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేసే పిల్లలపై వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు.

తల్లిదండ్రుల ఆస్తులను పిల్లలు తమ పేర్లపై మార్చుకుని, అనంతరం వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టే ఘటనలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన వయో వృద్ధులకు సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడ ఆటలు, మధ్యాహ్న భోజనం, టీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని, వృద్ధులు సంతోషంగా గడిపేందుకు కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande