
హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.)
ఓట్ల తొలగింపు వ్యవహారం అంశంపై మాజీ మంత్రి దానం నాగేందర్ ఎన్నికల కమిషన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఉంటున్న ప్రజల ఓట్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్ తన వైఖరి మార్చుకోకపోతే ఈసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరాన్ని తగలబెడతామని ఆయన తీవ్రమైన హెచ్చరికలు చేశారు.
హిమాయత్ నగర్ డివిజన్లో సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కుమ్మక్కై, వారికి అనుబంధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేవలం హిమాయత్ నగర్ డివిజన్లోనే దాదాపు 20 వేల వరకు ఓట్లను ఏకపక్షంగా తొలగించారని మండిపడ్డారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు వ్యవస్థీకృతమైన 'ఓట్ చోరీ'కి పాల్పడుతున్నారని విమర్శించారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకునే పూర్తి బాధ్యత తనపై ఉందని దానం స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..