
హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.)
గచ్చిబౌలి డ్రీమ్ ప్రైడ్ హోటల్
కేంద్రంగా విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
పక్కా సమాచారంతో హోటల్ పై గచ్చిబౌలి పోలీసులు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. నిర్వాహకుడు నిఖిల్, రామ్మోహన్ రెడ్డి, విటుడు హర్షిత్ సింఘానియా, వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు విదేశీ మహిళలు అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన స్థలం నుంచి 23 వాడిన కండోమ్స్, 13 వేల నగదు, మారం మోహన్ రెడ్డి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిర్వాహకుడు నిఖిల్ ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. మహిళలను గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్లో వేరే వేరే గదుల్లో ఉంచి కాస్టిలీ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పట్టుబడ్డ ముగ్గురు ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన వారీగా గుర్తించారు.
దొరికిన విదేశీ మహిళల వద్ద పాస్పోర్టులు, వీసాలు, చెల్లుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఉజ్బెకిస్తాన్ దేశం నుండి కొద్ది రోజుల క్రితమే హైదరాబాదుకు వచ్చినట్లు విచారణలో తేలింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..