నిజామాబాద్ కలెక్టర్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు.
Collector


నిజామాబాద్, 01 అక్టోబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

గత రెండు నెలలుగా ఆమె ప్రసూతి సెలవులో ఉన్నారు. ఈ సమయంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రసూతి సెలవు ముగియడంతో ఇలా త్రిపాఠి గురువారం తిరిగి విధుల్లో చేరి జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande