SIR లో ఫామ్ -6 మార్పు ఆదేశాలు ఎవరిచ్చారు? ఈసీ ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
SIR లో ఫామ్ -6 మార్పు ఆదేశాలు ఎవరిచ్చారు? ఈసీ ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi


న్యూఢిల్లీ, 01 అక్టోబర్ (హి.స.)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఫారం-6 లో మార్పులపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ లో ఫారం 6ను చట్టవిరుద్ధంగా మార్చారు, ఈసీ సొంత కమిషనర్లే ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఈసీఐలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు ఆ మార్పు చేయమని ఎవరు ఆదేశించారు? టీసీఎస్లో ఎవరు దానికి ఆమోదం తెలిపారు? అలా చేయడానికి వారిపై ఒత్తిడి తెచ్చారా? అని రాహుల్ గాంధీ గురువారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచీ ఫారం-6 కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపడాన్ని ఈసీ అధికారికంగా ఉపసంహరించుకుంది.

అంతకు ముందు ఎస్ఐఆర్ సందర్భంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు తమ తండ్రి, తాతల పేర్లను వెల్లడించాలని పేర్కొంటూ ఫారం-6కు అదనంగా డిక్లరేషన్ను ఈసీ జోడించింది. ఎస్ఐర్ సందర్భంగా తీసుకొచ్చిన ఈ నిబంధనపై ఇద్దరు కమిషనర్లు ఎస్ఎస్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ఓ జాతీయ పత్రికలో వచ్చిన పరిశోధనాత్మక కథనంతో ఈ అంశంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande