సెప్టెంబర్ లోను యూపీఐ చెల్లింపుల హవా
సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు రికార్డులు సృష్టించాయి. దేశంలో 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ' తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.
Upi

ఢిల్లీ , 01 అక్టోబర్ (హి.స.)

సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు రికార్డులు సృష్టించాయి. దేశంలో 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ' తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.

'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)' గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. ఇక లావాదేవీల విలువ 18 శాతం వృద్ధితో రూ.29.37 లక్షల కోట్లుగా నమోదైంది.

సెప్టెంబర్లో ప్రతిరోజూ సగటున 802 మిలియన్ల లావాదేవీలు జరుగగా వాటి విలువ సుమారు రూ.97,913 కోట్లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande