
ఆలూరు, 01 అక్టోబర్ (హి.స.)కర్నూలు జిల్లా ఆలూరులోని ఓ బట్టల షాప్లో అగ్నిప్రమాదం జరిగింది.
షార్ట్ సర్క్యూట్తో వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. షాప్ చుట్టూ భారీగా పొగ కమ్ముకుపోవడంతో మంటలు ఆర్పేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తినష్టం జరగడంతో యజమాని తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV