నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నా...రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించాం: నారాయణ
పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు.
నారాయణ


నెల్లూరు, 01 అక్టోబర్ (హి.స.)పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిధులతో పాటు తన సొంతనిధులను కూడా పేదల అభివృద్ధికి వెచ్చిస్తున్నానని వెల్లడించారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించామని మంత్రి నారాయణ అన్నారు.

ఆయన మాట్లాడుతూ.. వైజాగ్, విజయవాడలో వేలాది మందికి శాశ్వత నివాస ధ్రువీకరణ పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ’నెల్లూరులోనూ గతంలో 1450 మందికి పట్టాలిచ్చామని తెలిపారు.

త్వరలో మరో 1250 మందికి పట్టాలిస్తాం. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల్లో విజయం సాధిస్తాం. నా కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరూ రాజకీయాల్లోకి రారు. నా కూతురు షరణి మేయర్గా పోటీ చేయరు. ఇవన్నీ వట్టి ఆరోపణలు. నాపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు సేవ చేస్తాను’ అని మంత్రి నారాయణ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande