పెనుకొండలో ప్రజలతో మరియు మండల అధికారులతో మంత్రి సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత.
మంత్రి సవిత


పెనుకొండ, 01 అక్టోబర్ (హి.స.)ఈ రోజు ఉదయం పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత పలువురు నాయకులు, ప్రజలు, కార్యకర్తల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను సానుకూలంగా విని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబాల్లో జరగనున్న వివాహాలు, ఇతర శుభకార్యాలకు మంత్రిని ఆహ్వానించారు.

మండల అధికారులతో మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, త్వరలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

మంత్రి సవిత మాట్లాడుతూ.. రేపు అక్టోబర్ 2న రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన హార్టికల్చర్ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్కు హార్టికల్చర్ను పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.26 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. హార్టికల్చర్ నిధులను వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సూపర్ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేలా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత తెలిపారు.

హార్టికల్చర్ రంగం ద్వారా వ్యవసాయంతో పాటు గ్రామీణ మౌలిక వసతులు కూడా బలోపేతం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande