ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సీజేపీ (CJP) నిరసన ప్రదర్శన - ఉద్రిక్తత
ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సీజేపీ (CJP) నిరసన ప్రదర్శన - ఉద్రిక్తత
CJP PROTEST


ఢిల్లీ, 10 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సీజేపీ (CJP - కాక్రోచ్ జనతా పార్టీ) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఎవరినీ అక్కడకు చేరుకోవడానికి అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు అనుమతి తీసుకోకపోవడం, గత ప్రదర్శనల్లో నిబంధనలు ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈసారి అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం న్యూఢిల్లీ ప్రాంతంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 అమలులో ఉంది.

నిరసనకారులు జంతర్-మంతర్ వైపు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకు యత్నించిన పలువురు నిరసనకారులను, లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా, పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దిప్కేతో పాటు కీలక నాయకులను ఢిల్లీ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆందోళనల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. ప్రయాణికుల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం సుమారు 45 మెట్రో స్టేషన్లలో ప్రవేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నగరంలోని పలు సరిహద్దులు, ఐటీవో, మండి హౌస్ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా జంతర్-మంతర్ వైపు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande