ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేసు నమోదు చేసింది.
Nia


న్యూఢిల్లీ, 10 అక్టోబర్ (హి.స.)

ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేసు నమోదు చేసింది. కాక్పిట్లోనే ఒమన్కు చెందిన కో-పైలట్ (ఫస్ట్ ఆఫీసర్), భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్పై కత్తితో దాడి చేసి, విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చివేసేందుకు యత్నించాడనే తీవ్ర ఆరోపణలపై ఎఫ్ఎఆర్ దాఖలైంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్రోహ నిరోధక చట్టం (UAPA), యాంటీ-హైజాకింగ్ యాక్ట్-2016లోని తీవ్రమైన సెక్షన్ల కింద ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది.

సెప్టెంబరు 30న 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో ఈ ఘటన జరిగింది.

విమానం గాల్లో ఉండగా ఒమానీ ఫస్ట్ ఆఫీసర్ హఠాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కెప్టెన్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande