
ముంబై, 10 అక్టోబర్ (హి.స.)నేడు శనివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,720గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,160గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,44,900 పలుకుతోంది.
బంగారం ధరలు ఇవే..
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,160 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,160గా ఉంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,160గా కొనసాగుతోంది.
-. బంగారంతో పోలిస్తే వెండి రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,34,800 వద్ద ట్రేడవుతోంది
-హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గా కొనసాగుతోంది. శుక్రవారం రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.
-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది.
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,34,800 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,34,900గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV