
హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడులోని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రజలకు రూ. 13 వేల కోట్లకు పైగా విలువైన భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన బహుమతిగా ఇవ్వనున్నారు. పలు కీలక రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణలను ప్రధాని ఘనంగా నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలో రవాణా వ్యవస్థను, మౌలిక వసతులను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఈ పర్యటనలో రైల్వేలు, రోడ్డు మార్గాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు ప్రధానంగా చోటు దక్కించుకోనున్నాయి. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం ద్వారా చెన్నై నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. అంతేకాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని, ఈ భారీ ప్రాజెక్టుల ప్యాకేజీ తమిళనాడు ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi