
అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)
దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు విజయవాడలో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్-2026 నిర్వహించనున్నారు.
కృష్ణానది తీరంలో.. పక్కనే కనకదుర్గ అమ్మవారి జాతర నడుమ భవానీపురంలోని హరిత బెర్మ్పార్క్లో ఈ ఆహార పండుగ కొలువుదీరనుంది.
తెలుగు నేల ఆహార సంస్కృతిని, ఆంధ్రుల ఆతిథ్య సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. శాకాహార బఫే భోజనాన్ని ఒక్కొక్కరికి రూ.250కే అందించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ