తిరుమల శ్రీవారి.బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
తిరుమల శ్రీవారి.బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరిగింది
ttd


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుడి ఊరేగింపుతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande