
తిరుమల, 11 అక్టోబర్ (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల
శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళంగా అందాయి. జైపూర్కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు వీటిని అందజేశారు.
వీటిలో రూ.44.35 లక్షల విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షల విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల ముత్యాల హారాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ