ఎన్టీఆర్ వైద్య సేవలో అక్రమాలు
ఆంధ్రప్రదేశ్లో పేదలకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Doctors


అమరావతి , 11 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పేదలకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

2024–25 నుంచి 2026–27 మధ్యకాలంలో పథకానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన 203 ఆసుపత్రులపై మొత్తం రూ.34.39 కోట్ల జరిమానాలు విధించింది.

ఈ పథకం ఉద్దేశం అర్హులైన రోగులకు అవసరమైన చికిత్సను నగదు చెల్లించకుండా అందించడం. ముఖ్యంగా ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని కుటుంబాలకు ఇటువంటి పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే పథకం కింద చికిత్స అందించాల్సిన ఆసుపత్రులు రోగుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం లేదా అర్హులైన వారికి నగదు రహిత చికిత్స నిరాకరించడం వంటి సమస్యలు తలెత్తితే పథకం లక్ష్యం దెబ్బతింటుంది.

అధికారులకు అందిన ఫిర్యాదుల్లో రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, నగదు రహిత చికిత్స అందించకపోవడం, చికిత్సలో జాప్యం, వైద్య ప్రమాణాలను పాటించ లేదు.

జరిమానాలతో పాటు 25 ఆసుపత్రులను సస్పెండ్ చేయడం, 13 ఆసుపత్రులకు చెల్లింపులను నిలిపివేయడం, ఐదు ఆసుపత్రులను జాబితా నుంచి తొలగించడం, మరో ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande