నేపాల్ లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన ఇండ్లు, బ్రిడ్జిలు
నేపాల్ లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన ఇండ్లు, బ్రిడ్జిలు
Floods


నేపాల్ , 11 అక్టోబర్ (హి.స.)

రెండు నెలల క్రితం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే నేపాల్లో వరదలు మరోసారి బీభత్సం సృష్టించాయి. అకస్మిక వరద ఉధృతికి చాలా ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకు పోయాయి. గొర్ఖా జిల్లాలో బుధి గండకీ నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఊహించని విపత్తును అధికారులు గ్రహించేలోపే 35కు పైగా ఇళ్లు, పలు బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. ఆదివారం సంభవించిన వరద తీవ్రతకు జలవిద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆగస్టులో టిబెట్ సరిహద్దులో వరద విలయం 1,457 మందిని పొట్టనబెట్టుకోగా ఈసారి తాజా వరద తీవ్రత భారీగా ఆస్తి నష్టానికి కారణమైంది. గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో బుదీ గండకీ నది ఉప్పొంగడంతో.. కొండల మధ్య నుంచి వేగంగా దూసుకొచ్చిన వరద ఉధృతికి పదుల సంఖ్యలో ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.

ఆదివారం ఉదయం 3.66 మీటర్ల లెవల్ ఉన్న వరద తీవ్రత.. రెండు గంటల్లో 8.43 మీటర్లకు చేరింది. ప్రమాద సంకేతమైన ఐదు మీటర్లు దాటడంతో నష్టం భారీగా సంభవించింది. పెద్ద మొత్తంగా ఇసుక, బుదరలో కూడిన నీటి ప్రవాహం 34 ఇళ్లను, బ్రిడ్జిలను తుడిచిపెట్టేసిందని.. జలవిద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నదని జాతీయ వివత్తు తగ్గింపు, నిర్వహణ సంస్థ ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande