విజయవాడ ఉత్సవ్ 2.0 - ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ కీలక లేఖ
విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి.
PM Modi addressing the gathering during the inauguration of the 10th edition of the India Mobile Congress (IMC) 2026—themed 'Scale Without Boundaries'—in New Delhi on Thursday, October 8, 2026.


ఢిల్లీ, 11 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

విజయవాడ ఉత్సవ్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు. ఏపీలో ఈ వేడుకలు నిర్వహించడం సంతోషకరమని, ఇందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ చొరవకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని కితాబిచ్చిన మోదీ.. ఈ ఉత్సవ్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

నైపుణ్యాభివృద్ధిపై కూడా ఉత్సవం దృష్టి సారించడం సంతోషకరమన్నారు. అభివృద్ధి చెందిన భారత్ దిశగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి అభినందనలు తెలుపుతూ సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande