ముఖ్యమంత్రి విజయ్తో కలిసి చెన్నై మెట్రో ప్రారంభించిన మోదీ
చెన్నై నగర ప్రజల చిరకాల స్వప్నమైన చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్వర్క్లోని తొలి మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.
PM Narendra Modi Inaugurates Chennai Metro Phase 2


చెన్నై, 11 అక్టోబర్ (హి.స.)చెన్నై నగర ప్రజల చిరకాల స్వప్నమైన చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్వర్క్లోని తొలి మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.

చెన్నై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రజల ప్రయాణ సమయాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో పూనమల్లి నుంచి వడపళని వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్రాజెక్టును తమీళు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్తో కలిసి అధికారికంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. వీటిల్లో మెట్రో రైల్ ఫేస్ 2 విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, నగరాభివృద్ధిని వేగవంతం చేయడం వంటివి ఉన్నాయి. చెన్నై మెట్రో ఫేజ్ 2లో భాగంగా పూనమల్లి- వడపళని రూట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు రూ. 4,900 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కారిడార్ ఇది. 3.7 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక డబుల్ డెక్కర్ స్ట్రక్చర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డ్రైవర్ రహిత రైళ్లు ఇవన్నీ కూడా. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో అవి పని చేస్తాయి. పోరూర్ బైపాస్ నుంచి పూనమల్లీ స్టేషన్ వరకు ప్రధాని మోదీ, విజయ్ మెట్రో రైలులో ప్రయాణించారు. అలాగే మెట్రోలో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ప్రధాని మోదీ, విజయ్ ఆత్మీయంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత, సాయంత్రం 4 గంటల నుంచి సామాన్య ప్రయాణికులకు ఈ మార్గంలో సేవలు అందుబాటులోకి వస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande