
జిబౌటీ, 11 అక్టోబర్ (హి.స.)
ఆఫ్రికా తీరప్రాంతంలో అత్యంత విచారకరమైన పెను విషాదం చోటుచేసుకుంది. మెరుగైన భవిష్యత్తు, ఉపాధి అవకాశాల కోసం ఐరోపా ఖండానికి సముద్ర మార్గం ద్వారా బయలుదేరిన ఒక వలసదారుల పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో 109 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీ (Djibouti) తీరంలో మొత్తం 305 మందితో వెళ్తున్న వలసదారుల పడవ మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది పిల్లలతో సహా 109 మంది మరణించారు (52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది పిల్లలు) మరో 80 మందికి పైగా సురక్షితంగా బయటపడగా, 116 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే కాకుండా, సముద్రంలో ఎదురైన తీవ్రమైన ప్రతికూలవాతావరణం, అలల తీవ్రత తట్టుకోలేక ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అంతర్జాతీయ సహాయక వర్గాలు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక కోస్ట్ గార్డ్ దళాలు, అంతర్జాతీయ నిఘా బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న పలువురిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే నూట తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. గాలిన ప్రయాణికుల బోటు ప్రమాదకర స్థితిలో సముద్రంలో మునిగిపోవడంతో అనేక మంది ఊపిరాడక, నీటి మునిగి మరణించారని రెస్క్యూ బృందాలు ధ్రువీకరించాయి.
బాధితుల్లో ఎక్కువ మంది ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన నిరుపేద వలసదారులు ఉన్నట్లు సమాచారం. మెరుగైన జీవనం కోసం సుదూర ప్రాంతాలకు మానవ అక్రమ రవాణాదారులను నమ్మి ప్రమాదకర సముద్ర ప్రయాణాలు చేస్తున్న వలసదారులు ఇలా నిత్యం ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై విచారణ వేగవంతం చేసిన అధికారులు బాధ్యులైన వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi