
విజయవాడ, 11 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఉదయం 8 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు.. ప్రత్యేక పూజల తరవాత దర్శనాలు ప్రారంభమయ్యాయి.
అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తుల కోసం కృష్ణాతీరంలో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV