
అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.
దుష్టశక్తులపై దైవశక్తి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దివ్యాశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో శరన్నవరాత్రులకు ప్రత్యేకమైన స్థానం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుచుకోవడం మన సంప్రదాయంలో విశిష్టమైన భాగమని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటిచెప్పే విజయదశమి పండుగ ప్రజల్లో ధర్మబద్ధమైన జీవనం, సత్యం, న్యాయం పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV