అడవి తల్లి బాట 2.0ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
పవన్ కల్యాణ్


పోలవరం, 11 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాలలో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అడుగులు పడుతున్నాయి.

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలవరం జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రంపచోడవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో సమస్యలు తీర్చినట్టు నిజజీవితంలో తీర్చలేమని , సినిమాల్లో బ్యాగ్రౌండ్ పాట పెట్టి రెండున్నర గంటల్లోనే చాలా సేయవచ్చని అన్నారు.

కానీ నిజ జీవితంలో అలా కుదరదని పన్నెండు, పదిహేను సంవత్సరాలు కిందమీద పడిపోతూ కష్టపడాలని అన్నారు.మారుమూల గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామని చెప్పారు.

ఒక రోడ్డు వేస్తే బిడ్డల భవిష్యత్ మారిపోతుందని చెప్పారు. అందుకే రోడ్ల కోసం పంతం పట్టుకుని కూర్చుకున్నానని ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు రావాల్సిందేనని చెప్పారు.

లోతట్టులో ఉన్న తమ గ్రామాలకు రోడ్లు నిర్మించాలని దశాబ్దాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులను గిరిజనులు వేడుకుంటూనే ఉన్నారు. వారి మొర వినడమే తప్ప స్పందన లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలకు తెరదించింది. రహదారుల నిర్మాణంతో పాటు విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అడవితల్లి బాట’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు మన్యం జిల్లాలో పవన్ పర్యటించి పక్కా రోడ్లు మంజూరు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande