తిరుమలలో ముదరుతున్న కర్ణాటక ప్రవాసీ సౌధ వివాదం
తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన సత్రాలు, ప్రవాసీ సౌధ నిర్వహణ బాధ్యతలను ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
తిరుమల


తిరుమల, 11 అక్టోబర్ (హి.స.)తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన సత్రాలు, ప్రవాసీ సౌధ నిర్వహణ బాధ్యతలను ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

తిరుమల పుణ్యక్షేత్రం పూర్తిగా వెంకటేశ్వర స్వామివారి దివ్య సొత్తు అని, అందులోని ప్రతి రాయి, రప్ప, పుట్ట, చెట్టు సమస్తం స్వామివారికే అంకితమని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని కర్ణాటక సత్రాలకు చెందిన 7.5 ఎకరాల స్థలాన్ని కర్ణాటక టూరిజం కార్పొరేషన్కు బదిలీ చేస్తూ కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతూ ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతూ టీటీడీ అనుమతి లేకుండా సత్రాలు, ప్రవాసీ సౌధ నిర్వహణను కర్ణాటక ప్రభుత్వం దేవాదాయశాఖ నుండి టూరిజం శాఖకు బదిలీ చేసింది. అయితే నిజానికి సత్రాలు, ప్రవాసీ సౌధ ఆదాయంలో దేవాదాయ శాఖ, టూరిజం శాఖలకు చెరో 50 శాతం వాటా ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా టూరిజం శాఖకు బదిలీ చేయడం వివాదానికి దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, జనసేన పార్టీలు తప్పు పడుతున్నాయి. ఎంఓయూను రద్దు చేయాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ధార్మికక్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మారిస్తే ఊరుకోబోమని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఓ విమర్శలు వస్తున్నా కర్ణాటక ప్రభుత్వం మాత్రం బదలాయింపు ప్రక్రియను కొనసాగిస్తోంది.అయితే, నిబంధనలను అతిక్రమించి, సబ్-లీజుకు ఇచ్చే అవకాశం లేకపోయినా, ఈ భూమిని కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్కు కట్టబెడుతూ క్యాబినెట్ నోట్ తీసుకురావడం దారుణం. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కర్ణాటక సర్కారు Govt వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande