
నెల్లూరు జిల్లా,, 12 అక్టోబర్ (హి.స.)
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాలను నిర్మించమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం మహ్మదాపురంలో రూ.2 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం ఈరోజు (సోమవారం) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు. దేవాలయాల వల్లనే సమాజం మరింత బాగుపడుతుందన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ