మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు.
Collector

యాదాద్రి భువనగిరి, 12 అక్టోబర్ (హి.స.)

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు.

సోమవారం ఆయన ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

వివిధ గ్రామాల నుంచి తమ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి, సకాలంలో సేవలు అందించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande