
జగిత్యాల, 12 అక్టోబర్ (హి.స.)
ప్రజా వేదిక ద్వారా వస్తున్న బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటూన్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా కలిగించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..